వారణాసిలో మోడీ రోడ్ షో.. ‘‘జై శ్రీరామ్’’, ‘‘హరహర మహాదేవ’’ నినాదాలతో మారుమోగిన వీధులు (వీడియో)

Mar 4, 2022, 10:09 PM IST

మార్చి 7న జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల (up assembly elections) చివరి దశ పోలింగ్‌కు ముందు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో (varanasi) ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) రోడ్‌షో (road show)నిర్వహించారు. నగరంలోని మాల్దాహియా ప్రాంతంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి మోడీ పూలమాలలు వేసి ఆయన రోడ్ షో ప్రారంభించారు. ప్రధాని మోడీ కాన్వాయ్ నగరం గుండా వెళ్తుండగా.. బీజేపీ శ్రేణులు ‘జైశ్రీరామ్’ , ‘హర్ హర్ మహాదేవ్’ అంటూ నినాదాలు చేశారు. దారి పొడవునా వారంతా గులాబీ రేకుల వర్షం కురిపించారు. ఇదే సమయంలో డీజేలో ‘‘జో రామ్ కో లాయే హైం, హమ్ ఉంకో లాయేంగే’ అనే పాట ప్లే అవుతోంది. 

కాషాయ రంగు టోపీ, మెడలో ‘గంఛా’ (టవల్) కట్టుకున్న మోడీకి మద్ధతుగా నినాదాలు చేస్తూ పలువురు శంఖాలు ఊదుతూ కనిపించారు. రోడ్ షో సందర్భంగా.. పలువురు యువకులు, పిల్లలు బీజేపీ టోపీలు ధరించి మోడీకి మద్ధతు తెలిపారు. బీజేపీకి కంచుకోట అయిన వారణాసి సౌత్ నియోజకవర్గంలోని 3.5 కిలోమీటర్ల పాటు రోడ్ షో కవరైంది. ఇటీవల పునరుద్ధరించబడిన కాశీ విశ్వనాథ్ కాంప్లెక్స్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా శివయ్యకి ప్రత్యేక ప్రార్ధనలు చేసిన ఆయన ‘‘డమరుకం’’ వాయిస్తూ భక్తులను ఉత్సాహపరిచారు. 

కాశీ విశ్వనాథ్ కాంప్లెక్స్‌లో పూజల అనంతరం .. బెలారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి మోడీ పూలమాల వేసి నివాళుర్పించారు. వారణాసి పర్యటనలో భాగంగా డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ (డీఎల్‌డబ్ల్యూ) గెస్ట్‌హౌస్‌లో ఈ రాత్రికి మోడీ బస చేస్తారని బీజేపీ నగర అధ్యక్షుడు విద్యాసాగర్ రాయ్ తెలిపారు.