Jan 10, 2023, 3:06 PM IST
బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో రవాణా కష్టాలు తీర్చేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. నగరంలోని నాగ్వార్ రింగ్ రోడ్డులోని హెచ్బీఆర్ లేఅవుట్ సమీపంలో మెట్రో పనులు జరుగుతున్నాయి. అయితే ప్రమాదవశాత్తు మెట్రో పిల్లర్ కుప్పకూలడంతో తల్లీ కొడుకు మృతిచెందగా తండ్రి, కూతురు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులు తేజస్విని(28), విహాన్(2) గా గుర్తించారు. మెట్రో పిల్లర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకుని తల్లీ బిడ్డ మృతిచెందారు. ఇక మరో బిడ్డ వశిష్ట(2)తో పాటు తండ్రి గాయాలతో బయటపడ్డారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందినవెంటనే మెట్రో అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేసారు. తల్లీకూతురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.