జార్ఖండ్ : ఏనుగుల కోసం విమానాశ్రయాన్ని ఆపేశారు...

Jan 23, 2020, 10:47 PM IST

ఏనుగుల ఆవాసాలకు ఇబ్బంది కలిగుతుందన్న ఆందోళనలు వెలువడడంతో జార్ఖండ్ లో విమానాశ్రయం కోసం చేసిన ప్రతిపాదన వెనక్కి వెళ్లింది. భారతదేశ జాతీయ వారసత్వ జంతువు, అంతరించిపోతున్న జీవజాతికి చెందిన జంతువు ఏనుగు. అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల వీటి ఆవాసాలకు ముప్పు పొంచి ఉందని తేలింది. జార్ఖండ్ నుంచి పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ కు వలస వెళ్లే ఏనుగులకు జార్ఖండ్‌లోని అడవులు కారిడార్లుగా పనిచేస్తాయి. ప్రతిపాదిత దల్ భూమ్ ఘర్ విమానాశ్రయం ఈ అడవుల్లో దాదాపు 100 హెక్టార్ల భూమిని కోరింది.