క్రికెట్ ప్లేయర్ కూతురు క్రికెటరే అవ్వాలా ఏంటి.. అంచనాలకి మించి సౌరవ్ గంగూలీ కుమార్తె..

First Published | May 2, 2024, 1:53 PM IST

క్రికెట్ లెజెండ్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ  కుమార్తె సనా గంగూలీ క్రికెట్ మార్గంలో నడుస్తుందనే అంచనాలకు బదులుగా తన కెరీర్  ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో గొప్ప జీతం ప్యాకేజీతో కొనసాగుతుంది.
 

2001లో దిగ్గజ క్రికెటర్, మాజీ BCCI చీఫ్‌  సౌరవ్ గంగూలీ  కుమార్తె సనా గంగూలీ 21 ఏళ్ల  వయస్సులో ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద మల్టి నేషనల్  సంస్థ (MNCలు) ఒక విజయవంతమైన ఉద్యోగిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. 

 డాన్స్  షోస్, బేబీ ఫోటోగ్రాఫ్‌లతో పాపులరైన సనా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ (UCL) నుండి పట్టభద్రురాలైంది.


అయితే సనా  ఎడ్యుకేషన్ ప్రయాణం కోల్‌కతాలోని లోరెటో హౌస్ స్కూల్‌లో ప్రారంభమైంది, తరువాత UCLలో ఎకనామిక్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ   పూర్తి చేసింది. ఆమె కాలేజ్లో ఉన్న సమయంలో వివిధ ఇంటర్న్‌షిప్స్  యాక్టీవ్ గా పూర్తి చేయడం ద్వారా మంచి స్కిల్స్  పెంపొందించడంలో తన డెడికేషన్  చూపించింది. 
 

UCL నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సనా ఎనాక్టస్‌లో ఫుల్ టైం ఉద్యోగం చేసింది. ICICI, KPMG, Goldman Sachs, Barclays ఇంకా  HSBC వంటి ప్రతిష్టాత్మక కంపెనీలకు కూడా ఆమె పనిచేశారు. 

గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే సమయానికి సనా అతిపెద్ద MNCలలో ఒకటైన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన PwCలో ఇంటర్న్‌షిప్‌  ప్రారంభించింది. స్కిల్స్ ఉన్న ఉద్యోగులకు PwC అందించే ఇంటర్న్‌షిప్ ప్యాకేజీ సంవత్సరానికి రూ. 30 లక్షలు  ఉంటుందని అంచనా.
 

తన PwC ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత సనా దృష్టి మరో కార్పొరేట్ దిగ్గజం డెలాయిట్‌ వైపు మళ్లించింది. ఈ ఏడాది జూన్‌లో ఆమె ఇంటర్న్‌షిప్‌ను ప్రారంభించి సెప్టెంబర్ వరకు ఉంటుందని  భావిస్తున్నారు.  Glassdoor   ఇతర ఎంప్లాయిమెంట్  పోర్టల్‌ల నుండి సేకరించిన ఇండస్ట్రి డేటా ప్రకారం, డిపార్ట్‌మెంట్ ఆధారంగా డెలాయిట్ ఏటా రూ. 5 లక్షల నుండి రూ. 12 లక్షల వరకు ఇంటర్న్‌షిప్ ప్యాకేజీలను అందిస్తుంది.

క్రికెట్ ప్లేయర్‌ కుటుంబ వారసత్వం నుండి నుండి కార్పొరేట్ విజయానికి సనా ప్రయాణం వృత్తిపరమైన రంగంలో తన సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవాలనే ఆమె సంకల్పం ఇంకా సామర్థ్యానికి నిదర్శనం.

Latest Videos

click me!