పచ్చి వెల్లుల్లి తింటే.. ఆశ్చర్యపోయే లాభాలు...

Sep 19, 2020, 8:09 PM IST

ఘాటైన వాసనతో ఉండే వెల్లుల్లి అంటే చాలామంది ఇష్టపడరు. కానీ వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిది. పప్పులు, చారుల్లో పోపులాగా.. కూరల్లోనూ వెల్లుల్లిని వాడుతుంటారు. అయితే పచ్చివెల్లుల్లి తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. చిన్నపిల్లలు కొన్నిసార్లు పచ్చివెల్లుల్లి కసకస నమిలేస్తుంటారు. కానీ పెద్దవాళ్లు నోరు వాసనవస్తుందని తినరు. అయితే అది చాలా మంచి అలవాటని రోజూ ఉదయాన్నే పరగడుపున పచ్చివెల్లుల్లి తింటే ఆరోగ్యం మీ వెంటే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.