రోజూ రాత్రి బెల్లం నీరు తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published Apr 30, 2024, 3:47 PM IST

ఆ బెల్లాన్ని నీటిలో కరిగించి ఆ నీటిని రోజూ రాత్రిపూట తాగడం వల్ల చాలా రకాల సమస్యలను తగ్గించవచ్చు. బెల్లం నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

jaggery water

ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మారుతున్న లైఫ్ స్టైల్ , సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం ఇలా కారణాలు ఏవైనా ఏదో ఒక అనారోగ్య సమస్య అందరినీ వేధిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా 30-40 ఏళ్ల మధ్య వయస్కులకు వివిధ రకాల జబ్బుల బారిన పడుతున్నారు. అయితే.. సమస్యను ఆదిలోనే గుర్తిస్తే... వెంటనే దానికి సంబంధించిన చికిత్స తీసుకోవచ్చు. ఆలస్యం చేస్తే.. రోగం మరింత ముదురుతుది. అయితే.. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఎలాంటి చికిత్స లేకుండానే ఇంట్లోనే పరిష్కరించవచ్చని మీకు తెలుసా?

jaggery

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో బెల్లం ఉంటుంది. దానితో మనం చాలా రకాల రెసిపీలు తయారు  చేసుకుంటాం. అయితే.. ఆ బెల్లాన్ని నీటిలో కరిగించి ఆ నీటిని రోజూ రాత్రిపూట తాగడం వల్ల చాలా రకాల సమస్యలను తగ్గించవచ్చు. బెల్లం నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

jaggery 4p

ముందుగా.. ఈ బెల్లం నీటికి బెల్లం, మంచినీటితో పాటు.. ఒక యాలకలు కూడా వాడాలి.  ఒక గ్లాసు నీటిని తీసుకొని వేడి చేయాలి. ఆ వేడి చేసిన నీటిలో వెల్లం, ఒక యాలక్కాయ వేసి కాసేపు అలానే ఉంచాలి.. తర్వాత..ఆ నీటిని వడబోసి.... రాత్రిపూట తాగాలి. కావాలంటే పసుపు కూడా కలుపుకోవచ్చు.  ఈ వాటర్ రోజూ రాత్రిపూట తాగడం వల్ల.. మన రోగనిరోధక శక్తి పెరుగగుతుంది.
 


ఈ పానీయం చేతులు , పాదాల నొప్పులు , వాపులు, కీళ్ల నొప్పులు, పాదాల నొప్పి , చికాకు, అలసట, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అజీర్ణం, మలబద్ధకం, అపానవాయువు, రక్తహీనత, చర్మ సమస్యలు, అలర్జీ, ఉబ్బసం వంటి వివిధ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ ప్రత్యేక పానీయాన్ని రాత్రి నిద్రపోయే ముందు గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.
 

బెల్లం ప్రయోజనాలు: బెల్లంలో ఐరన్, కాల్షియం, పొటాషియం, సోడియం, చక్కెర ,విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వాతావరణ మార్పుల వల్ల కొందరికి ఆస్తమా, జలుబు, దగ్గు వంటివి వస్తాయి.ఈ మధ్యకాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ డ్రింక్ తాగినా లేదంటే.. రాత్రిపూట పాలలల్లో బెల్లం వేసుకొని తాగడం వల్ల కూడా నిద్రలేమి సమస్య నిద్రలేమితో బాధపడేవారు పాలలో బెల్లం కలిపి తాగితే మంచి నిద్ర వస్తుంది. అంతే కాకుండా వాత, పిత్త, రక్తహీనతలను బెల్లం నయం చేస్తుంది. ఋతుస్రావం సమయంలో శారీరక అలసట నుండి ఉపశమనం పొందడానికి మహిళలు దీనిని తీసుకోవచ్చు.

click me!