కూరలో కారం ఎక్కువైతే ఏం చేయాలి?

First Published Apr 30, 2024, 3:54 PM IST

కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా కూరంలో కారం ఎక్కువ అవుతుంటుంది. కానీ చాలా మందికి కూరలో కారాన్ని ఎలా తగ్గించాలో తెలియక కూరను డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. కానీ కొన్ని సింపుల్ టిప్స్ తో కూరలో కారాన్ని ఈజీగా తగ్గించొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

వంట చేయడం నిజంగా ఒక కళే. ఆడవాళ్లే కాదు మగవారు కూడా వంటలను టేస్టీ టేస్టీగా చేస్తుంటారు. కూరలు చేయడంలో ఎంత ఎక్స్ పర్ట్ అయినా కొన్ని కొన్ని సార్లు చిన్నచిన్న పొరపాట్లు చేస్తుంటారు. మనం వండే గ్రేవీ లేదా కూరలు ఒక్కోసారి మరీ ఉప్పగా లేదా కారంగా అవుతుంటాయి. అయితే ఈ మసాలా దినుసుల ఎఫెక్ట్ ను తగ్గించడానికి కొన్ని చిట్కాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. మీరు వండిన కూరలో ఉప్పు లేదా కారం ఎక్కువైతే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

పెరుగు

మీరు చేసిన వంట మరీ స్పైసీగా అయితే టెన్షన్ పడకండి. కారం తగ్గడానికి మీరు చేసిన కూరలో కొన్ని నీళ్లు పోయండి. అలాగే కొద్దిగా పెరుగును కలపండి. దీనివల్ల గ్రేవీ చిక్కగా ఉంటుంది. కారం కూడా తగ్గుతుంది. పెరుగు మీ చేసిన కూరలో మసాలా ఎఫెక్ట్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. 

నిమ్మరసం

నిమ్మరసం కూడా స్పైసీని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఉప్పు ఎక్కువైనా పులుసు లేదా గ్రేవీలకు కొద్దిగా నిమ్మరసాన్ని కలిపితే సరి. సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ పెరిగిన ఆల్కలీనిటీని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే బియ్యం పిండి లేదా శనగపిండిని కొద్ది మొత్తంలో నీటిలో కలిపి కూరలో వేయండి. ఇది అదనపు మసాలా దినుసులను గ్రహించడానికి సహాయపడుతుంది.
 

కూరగాయలు 

క్యారెట్, ఉల్లిపాయలు, టమాటాలు వంటి కూరగాయలను సన్నగా తరిగి మీరు చేసిన కూరలో వేయండి. ఇది ఆహారంలో ఉప్పు, కారాన్ని తగ్గిస్తుంది. 
 

వేరుశెనగ పేస్ట్

మటన్ గ్రేవీ, కారం, సాంబార్, చికెన్ గ్రేవీ వంటి స్పైసీ ఫుడ్స్ లో కారం మరీ ఎక్కువైనప్పుడు కంగారు పడకండి. కూరలో ఉప్పును తగ్గించడానికి కాల్చిన వేరుశెనగలను పేస్ట్ గా గ్రైండ్ చేసి కూరలో కలపండి. ఉడకబెట్టిన పులుసులలో ఉండే ఉప్పును, గ్రేవీని  తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. జీడిపప్పును పేస్ట్ లా గ్రైండ్ చేసి కూడా కూరలో వేయొచ్చు. 
 

పంచదార లేదా కెచప్

 చికెన్ గ్రేవీ, పనీర్ బటర్ మసాలాతో సహా రకరకాల కూరలు చేసినప్పుడు కొన్ని కొన్ని సార్లు స్పైసీగా లేదా ఉప్పుగా అవుతుంటాయి. ఈ కూరల్లో స్పైసీ తగ్గాలంటే గ్రేవీలో కొద్దిగా పంచదార లేదా కెచప్ లను కలపండి. ఇది ఫుడ్ గ్రేవీని చిక్కగా చేస్తుంది. 

click me!