Sep 24, 2019, 4:22 PM IST
కొణిదెల నిహారిక..మెగా డాటర్ గానే కాకుండా కాస్త హట్ కే అంటూ రొటీన్ కి భిన్నంగా వెబ్ సిరీస్ లు, సినిమాలతో దూసుకుపోతోంది. లేటెస్ట్ గా మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరిస్ తో రాబోతోంది. నలుగురు మిలియనీర్ యంగ్ స్టర్స్ జీవితాల్లో రోజువారీ ఎదురయ్యే సవాళ్లు వాటిని వారు ఎలా ఎదుర్కొంటారనే అంశాలపై తీసిన కామెడీ సిరీస్ ఇది. రీసెంట్ గా దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఏదైనా డిఫరెంట్ గా చేయడమే తమ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లక్ష్యం అని అందుకే ఈ కర్టెన్ రైజర్ ని కూడా ట్రైలర్ ప్లస్ మ్యూజిక్ వీడియోలాగా చేశామని చెప్పారామె.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మ్యాపర్ ప్రెజంట్స్ పై నీహారిక స్వయంగా ఈ సిరీస్ ని నిర్మిస్తోంది. మహేష్ ఉప్పల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి ఇన్ఫినిటం అనే కటింగ్ ఎడ్జ్ డిజిటల్ ఫ్లాట్ ఫాం ఇస్తుంది. మ్యాపర్ యాప్ వారు ఈ వెబ్ సిరీస్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు.తను గతంలో చేసిన 'నాన్నకూచి', 'ముద్దపప్పు ఆవకాయ' తరహాలోనే ఈ 'మ్యాడ్ హౌస్' కూడా ఆదరించాలని కోరింది నిహారిక. టీవీలో ఇప్పటికీ ఎక్కువగా చూసే సిరీస్ అమృతం అని అలా మ్యాడ్ హౌస్ కూడా అందరికీ నచ్చే సిరీస్ అవుతుందని హామీ ఇస్తోందీ మెగా డాటర్. వంద ఎపిసోడ్ల భారీ వెబ్ సిరీస్ గా రానుంది ఈ మ్యాడ్ హైస్. వీక్లీ వన్ ఎపిసోడ్ ఉంటుందని చెబుతోందీ నాన్నకూచి.