తమిళ్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా భారీ అంచనాల మధ్య క్రితం నెలలో థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 14న 8 భాషల్లో ఈ కంగువా విడుదలైంది. తమిళ్ బాహుబలిగా అక్కడి మీడియా ఈ కంగువా సినిమానికి అభివర్ణించగా.. రూ.1000 కోట్ల వరకూ వసూలు చేస్తుందని జోస్యం కోలీవుడ్ పెద్దలు జోస్యం చెప్పారు.
అయితే అవేమీ నిజం కాలేదు. సినిమా డిజాస్టర్ అయ్యి కూర్చుంది. అసలు అంత పెద్ద ప్లాఫ్ అవుతుందని సూర్య ఊహించలేదు. మినిమం కలెక్షన్స్ కూడా వసూలు చేయలేకపోయింది. ఈ నేపధ్యంలో ఓటిటిలోకి ఈ సినిమా వచ్చింది.
అయితే ఓటిటిలో కూడా కంగువ సినిమా వర్కవుట్ కాలేదు. కంగువా సినిమాలో సూర్య డ్యూయెల్ రోల్ చేస్తుండగా.. అతని సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటాని నటించింది. అలానే ఇటీవల సౌత్‌లో వరుస సినిమాలు చేస్తున్న బాబీ డియోల్ విలన్‌గా చేస్తున్నాడు. ఈ సినిమాలోనూ చేసారు.
స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ కంగువా సినిమాని నిర్మించాయి. కంగువా వెయ్యేళ్ల కిందటి కథ అని డైరెక్టర్ శివ స్పష్టం చేయగా.. కంగువా సీక్వెన్స్ కూడా ఉంటుందని సంకేతాలిచ్చారు. బాహుబలి తరహాలో కంగువా -1 క్లైమాక్స్‌లో ఐదు ప్రశ్నలతో సినిమాని ముగించామని కూడా డైరెక్టర్ శివ తెలిపారు. వాటికి జవాబులు తెలియాలంటే కంగువా-2 చూడాలని అన్నారు. అయితే కంగువా 2 ఇప్పుడు తీస్తారని నమ్మకమే లేదు.
Suriya
ఈ నేపధ్యంలో సూర్య ఇప్పుడు ఏ కథ తో సినిమా చేస్తారు అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. ఏ దర్శకుడుతో ముందుకు వెళ్ళబోతున్నారనేది తమిళనాట హాట్ టాపిక్ గా జరుగుతున్న అంశం. ఇక సూర్య నెక్ట్స్ చిత్రం ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతోంది. అలాగే సూర్య 45 వ చిత్రం ఆర్ జే బాలాజి దర్శకత్వంలో రూపొందనుంది. ఇప్పుడు ఖచ్చితంగా స్క్రిప్టు మీద దృష్టి ముందుకు వెళ్లాల్సిన సమయం.
Suriyas Kanguva Sunday Tamil collection report out
అలాగే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరక్షన్ లో కూడా సినిమా చెయ్యటానికి సూర్య చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దుల్కర్ తో చేసిన లక్కీ భాస్కర్ నచ్చిన సూర్య తనతోనూ చేయమని అడిగారని చెప్పుకుంటున్నారు.
తన సూపర్ స్టార్ ఇమేజ్ ని ప్రక్కన పెట్టి కథ చేయమని వెంకీ అట్లూరి ని అడిగినట్లు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలతో సూర్య బౌన్స్ బ్యాక్ అవుతారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయమై ఇప్పటిదాకా ఎటువంటి అఫీషియల్ ప్రకటన లేదు.
‘పిజ్జా’, ‘పేట’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులనూ మెప్పించిన కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj). ప్రస్తుతం సూర్య హీరోగా ‘సూర్య 44’ (#Suriya 44) (వర్కింగ్ టైటిల్) తెరకెక్కిస్తున్నారు. సూర్యతో సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘నేనేదైనా సినిమా చేస్తుంటే.. గ్యాంగ్‌స్టర్ స్టోరీతో అది రూపొందుతుందని చాలామంది అనుకుంటుంటారు. ఈ సినిమా విషయంలోనూ అంతే. ‘సూర్య 44’ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ కాదు. యాక్షన్‌తో కూడిన ప్రేమకథా చిత్రమది’’ అని పేర్కొన్నారు. త్వరలోనే టైటిల్ ప్రకటించనున్నారు.