ఫ్యామిలీతో సహా చిరంజీవిని అల్లు అర్జున్‌ కలవడం వెనుక అసలు కారణం ఇదే, ఆ క్రెడిట్‌ మొత్తం ఆయనకేనా?

First Published | Dec 15, 2024, 2:28 PM IST

అల్లు అర్జున్‌ అరెస్ట్ ఎపిసోడ్‌ ఉంది. ఇప్పుడు అంతా బన్నీకి మద్దతు పలుకుతున్నారు. అయితే తాజాగా ఆదివారం అల్లు అర్జున్‌ తన ఫ్యామిలీతో కలిసి చిరంజీవిని కలవడం ఆసక్తికరంగా మారింది. 
 

అల్లు అర్జున్‌ అరెస్ట్ వివాదం యావత్‌ తెలుగు రాష్ట్రాలను షేక్‌ చేసిన విషయం తెలిసిందే. అందరి అటెన్షన్‌ ఈ ఎపిసోడ్‌ పైనే ఉంది. ఓ స్టార్‌ హీరోని అరెస్ట్ చేయడమనేది అందరికి షాకింగ్‌గా మారింది. ఉత్కంఠభరిత డ్రామా మధ్య అల్లు అర్జున్‌కి మధ్యంతర బెయిల్‌ రావడం, అయినా ఒక రోజు రాత్రి బన్ని జైల్లో ఉండటం జరిగిపోయింది. శనివారం మార్నింగ్‌ ఆయన విడుదలయ్యారు. అనంతరం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరై సానుభూతిని, తమ సపోర్ట్ ని అల్లుఅర్జున్‌కి తెలియజేశారు. 

ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్‌ మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. తన ఫ్యామిలీతో సహా ఆయన చిరంజీవి ఇంటికి వెళ్లారు. అంతేకాదు స్వయంగా తనే కారు డ్రైవ్‌ చేసుకుంటూ మామయ్య చిరంజీవి ఇంటికి వెళ్లడం విశేషం. బన్నీతోపాటు భార్య స్నేహారెడ్డి, కూతురు అల్లు అర్హ, కొడుకు అయాన్‌ కూడా ఉన్నారు. చిరంజీవిని మర్యాద పూర్వకంగా అల్లు అర్జున్‌ కలిసినట్టు తెలుస్తుంది. అయితే ఈ కలయిక కి అసలు కారణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
 

Tap to resize

Allu Arjun

అల్లు అర్జున్‌ అరెస్ట్ అయ్యాక హుఠాహుటిన షూటింగ్‌ క్యాన్సిల్‌ చేసుకుని వచ్చాడు చిరంజీవి. ఆయన అల్లు అరవింద్‌ ఇంటికి వెళ్లాడు. అక్కడే చాలా సేపు ఉన్నాడు. ఈ క్రమంలో తెరవెనక చాలా జరిగిందని తెలుస్తుంది. బన్నీని అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు మొదట పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకి తరలించారు. అక్కడ అల్లు అర్జున్‌ కేసుకి సంబంధించిన వాదోపవాదనలు జరిగాయి. కోర్ట్ బన్నీకి రిమాండ్‌కి విధించింది. ఈ లెక్కన 14 రోజులపాటు పోలీసు కస్టడీకి అల్లు అర్జున్‌ని తరలించాల్సి ఉంటుంది. దీంతో వెంటనే ఆయన్ని చంచల్ గూడ జైలుకి తరలించారు. 
 

అయితే హైకోర్ట్ లో బన్నీ తరఫున లాయర్‌ క్వాష్‌ పిటీషన్‌ వేశారు. శుక్రవారం సాయంత్రం దీనిపై చర్చ జరిగింది. అల్లు అర్జున్‌ తరఫున సుప్రీంకోర్ట్ లాయర్‌ నిరంజన్‌ రెడ్డి వాదించారు. ఆయన వాదనల అనంతరం కోర్ట్ బన్నీకి మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. దీంతో శుక్రవారం రాత్రినే బన్నీని విడుదల చేయాల్సింది.

కానీ బెయిల్‌ ఉత్తర్వులు వచ్చేలోపు 5.30 గంటలు దాటింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలున్నా, జైల్లో ఉండాల్సిందే. అప్పటికే అల్లు అర్జున్‌ని చంచల్‌గూడ జైలుకి తరలించారు పోలీసులు. దీంతో ఆ రాత్రి విడుదల చేయలేదు. శనివారం ఉదయం ఆయన్ని విడుదల చేశారు. 

అయితే బన్నీకి బెయిల్‌ రావడం వెనుక, లాయర్‌ నిరంజన్‌ రెడ్డి రంగంలోకి దిగడం వెనుక చిరంజీవి ప్రమేయం ఉందని సమాచారం. అంతేకాదు ప్రభుత్వ పెద్దలతోనూ ఆయన చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. నిరంజన్‌ రెడ్డి వెంటనే రంగంలోకి దిగడం వెనుక చిరంజీవి ప్రమేయం ఉందట.

ఎందుకంటే వీరిద్దరు మంచి స్నేహితులు. కలిసి సినిమాలు కూడా చేశారు. ఈక్రమంలో తెరవెనుక చిరు చక్రం తిప్పారని అంటున్నారు. హైకోర్ట్ వాదనలకు సంబంధించిన ప్రభుత్వం తరఫున సరైన లాయర్‌ని పెట్టకపోవడానికి కూడా చిరు ప్రభావం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
 

ఇంట్లో కూర్చొని చిరంజీవి అటు కోర్ట్ ని, ఇటు ప్రభుత్వంలోనూ చక్రం తిప్పి అల్లుడు అల్లు అర్జున్‌ బయటకు వచ్చేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్టు బన్నీ టీమ్‌ నుంచి తెలుస్తున్న సమాచారం. అందుకే మామయ్య చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు అల్లు అర్జున్‌ స్వయంగా ఫ్యామిలీతో కలిసి వెళ్లారని సమాచారం. ఇదే నిజమైతే, తన అరెస్ట్ ఎపిసోడ్‌లో తాను బయటకు రావడానికి సంబంధించిన క్రెడిట్‌ మొత్తం మామయ్య చిరంజీవికి ఇచ్చినట్టు అవుతుంది. 

అయితే ఈ కేసులో బన్నీకి మధ్యంతర బెయిల్‌ మాత్రమే వచ్చింది. ఇది రెండు వారాలు మాత్రమే ఉంటుంది. ఈలోపు సాధారణ బెయిల్‌ తెచ్చుకుంటేనే ఆయన బయట ఉండగలడు. లేదంటే మళ్లీ అరెస్ట్ ఉంటుంది. ఈ లోపు తెరవెనుక జరగాల్సిన కథ అంతా జరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక డిసెంబర్‌ ఐదున అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప 2` సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ముందు రోజు ప్రీమియర్స్ వేశారు. ఫ్యాన్స్ మధ్య సినిమా చూసేందుకు సంధ్య థియేటర్‌కి వెళ్లారు బన్నీ.

ఈ విషయం తెలిసి భారీగా ఫ్యాన్స్ తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ఆసుపత్రిలో చికిత్సి పొందుతున్నాడు. తన భార్యకి కారణమైన వారిపై ఆమె భర్త భాస్కర్ చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ కేసులోనే బన్నీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే బాధితులకు అల్లు అర్జున్‌ 25లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అలాగే బాలుడి వైద్య ఖర్చులు కూడా చూసుకుంటున్నారు. 

read more: హీరోయిన్ల విషయంలో సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేష్‌ ఇద్దరిలోనూ ఒక్కటే వీక్‌నెస్‌, రాఘవేంద్రరావు బయటపెట్టిన నిజం

also read: ఇది కదా అభిమానం అంటే, అల్లు అర్జున్ ని కలిసిన ఉపేంద్ర.. భార్య ముందు ఖిలాడీగా..

Latest Videos

click me!