పూర్తిగా మనిషిలా మారుతోన్న రోబోలు.. మస్క్‌ మరో సంచలనం..

By Narender Vaitla  |  First Published Dec 15, 2024, 2:09 PM IST

Viral Video: భవిష్యత్తు అంతా రోబోలదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా రోబోటిక్స్‌ రంగంలో శరవేగంగా మార్పులు వస్తున్నాయి. అచ్చంగా మనిషిని పోలిన మర మనుషులను తయారు చేసేందుకు కంపెనీలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ విడుదల చేసిన ఓ వీడియో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. 
 


రోబోలు.. ఈ టాపిక్‌ ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా వచ్చిన రోబో సినిమా చూసిన సమయంలో రోబోలు నిజంగానే ఇలా మనుషుల్లా ప్రవర్తిస్తాయా.? అని చాలా మంది అనుకున్నారు. కానీ రోబోలు మనుషులను మించిపోయే రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్పక తప్పేలా లేవు. రోబోటిక్స్‌ రంగంలో రోజురోజుకీ వస్తున్న మార్పులే దీనికి కారణంగా చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దిగ్గజ సంస్థలు హ్యుమనాయిడ్ రోబోలను తయారు చేస్తున్నాయి. అంటే అచ్చంగా మనిషిలా ప్రవర్తించే రోబోలు. 

మనిషి చేయని ఎన్నో పనులను రోబోలు చేస్తాయని తెలిసిందే. అయితే మనిషిలా ఆలోచించే రోబోలు కూడా వచ్చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెక్‌ దిగ్గజం టెస్లా కంపెనీకి చెందిన ఓ హుమనాయిడ్ రోబోకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూస్తే రోబో చిత్రంలో శంకర్‌ చూపించిన రోబోలు త్వరలోనే మార్కెట్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Tap to resize

Latest Videos

A post shared by Tesla (@teslamotors)

 

undefined

టెస్లా మోటార్స్‌ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీలో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ఇందులో ఓ రోబో ఏటవాలుగా ఉన్న ప్రదేశం నుంచి కిందికి దిగుతోంది. సహజంగా మనుషులమైతే ఇలాంటి ఏటువాలు ప్రదేశం నుంచి దిగే సమయంలో వేగాన్ని కంట్రోల్ చేయడానికి అడుగులో అడుగు వేస్తూ ముందుకు నడుస్తుంటాం. మరి రోబోలకు అలాంటి పరిజ్ఞానం ఉండదు కదా! అయితే టెస్లా తయారు చేస్తున్న ఈ కొత్త రోబో మాత్రం అచ్చంగా మనుషుల్లాగే నడుస్తోంది. 

 

కింద పడకుండా తనను తాను కంట్రోల్ చేస్తూ కిందికి దిగుతోంది. అదే విధంగా పైకి ఎక్కుతోంది. ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. 'మనిషిలా నడవాలంటే. ముందు మనిషిలా తడబడడం కూడా నేర్చుకోవాలి' అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సహజంగా మనిషి కింద పడిపోతుంటే తనను తాను ఎలా కంట్రోల్‌ చేసుకుంటాడో ఈ రోబో కూడా అలాగే కంట్రోల్ చేసుకుంటుండడం విశేషం. ఈ వీడియోకు ఇప్పటి వరకు సుమారు రెండున్నర లక్షలు రావడం విశేషం. మొత్తం మీద మస్క్‌ రోబోటిక్‌ రంగంలో సంచలనం సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 

click me!