కేంద్ర ప్రభుత్వ పథకం
విద్య అనేది గొప్ప ధనం... దీన్ని సంపాదిస్తే చాలు డబ్బు, హోదా, గౌరవం వాటంతట అవే వస్తాయి. విద్యావంతుడు ఏ శిఖరానికైనా చేరుకోవచ్చు. అయితే పేదరికం కొందరు విద్యార్థులను చదువుకు, ఉద్యోగావకాశాలకు దూరం చేయవచ్చు. అందుకే ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకోలేనివారు, వెనుకబడిన ప్రాంతాలు, కులాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు కేంద్రం సిద్దమయ్యింది.
SC, ST, OBC (క్రీమీ లేయర్ కానివారు), మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఉచిత శిక్షణను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.
కాలేజీ విద్యార్థులు
Coaching Schemes For Sc/st/obc (non-creamy Layer) & Minority Students For Universities పథకం కింద గ్రామీణ విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోటీ పరీక్షలు, ఎన్ఈటి పరీక్షలకు శిక్షణ ఇస్తారు.
విద్యార్థులు కాలేజీ ప్రిన్సిపాల్‌ను సంప్రదించి దరఖాస్తులను పొందాలి. ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, విద్యా ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను సమర్పించాలి. అర్హులైన విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.
విద్యార్థులకు ఉచిత కోచింగ్
ఈ పథకం కింద శిక్షణ ఇచ్చే కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుంది. పుస్తకాలు, పత్రికలు, బోధనా సామగ్రి, కంప్యూటర్లు, ఫోటోకాపియర్, జనరేటర్ లేదా ఇన్వర్టర్ వంటి వాటి కోసం గరిష్టంగా 7 లక్షల రూపాయల వరకు అందిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వ పథకం
విద్యార్థులకు శిక్షణ, సలహాలు ఇచ్చే ఉపాధ్యాయులకు జీతాలను కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉన్నత విద్య, ఉద్యోగాలు, IAS, IPS వంటి పోటీ పరీక్షలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి... ఇంగ్లీష్ తో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ, సలహాలు అందిస్తారు.
ప్రభుత్వ పోటీ పరీక్షలు, ఉన్నత విద్య కోసం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఉచిత శిక్షణ పథకంలో చేరి ప్రయోజనం పొందవచ్చు.