ఫైటర్ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న విజయ్ దేవరకొండ

Jan 16, 2020, 2:53 PM IST

విజయ్ దేవరకొండ బాక్సర్ గా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ‘ఫైటర్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20 వ తేదీ నుండి ముంబైలో ప్రారంభం కానుంది. విజయ్ దేవరకొండ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్న ట్రైనర్ తో మార్షల్ ఆర్ట్స్ కాంబోను నేర్చుకుంటున్నట్లు చెబుతూ ఛార్మి ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్, సౌత్ ఇండస్ట్రీలో ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.