Jul 26, 2020, 4:03 PM IST
ఆర్జీవీని చూసి దర్శకత్వం చేయాలన్న ఆలోచనతో ఇండస్ట్రీకి వచ్చానని జబర్థస్త్ అధిరే అభి అన్నాడు. రామ్ గోపాల్ వర్మ పై వైరల్ అవుతున్న తన వీడియో మూడేళ్ల క్రితం నాటిదని క్లారిటీ ఇచ్చాడు. పవర్ స్టార్ షార్ట్ ఫిల్మ్ మీద మాట్లాడుతూ.. ఎంతో నాలెడ్జ్ ఉన్న ఆర్జీవీ ఇలాంటి సినిమాలు తీయాల్సింది కాదని అన్నాడు. ఇప్పటికీ ఆర్జీవీని చూసి నేర్చుకునేవాళ్లు చాలామంది ఉన్నారని, వారికి తప్పుడు మార్గం చూపొద్దని వేడుకున్నాడు.