మెట్టు మెట్టుకూ కర్పూరం వెలిగిస్తూ 600 మెట్లు ఎక్కి పళని మురుగన్ ని దర్శించుకున్న సమంత..!

Feb 14, 2023, 10:20 AM IST

సమంత ఎక్కువగా భక్తి మార్గంలో పయనించే నటి. నాగ చైతన్యతో బ్రేకప్ సమయంలో సమంత ఇండియాలో ప్రముఖ దేవాలయాల్లో పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.  గత ఏడాది సమంత మయో సైటిస్ అనే వ్యాధికి గురైంది. కోలుకోవటానికి చాలా సమయమే పట్టింది. ఈ వ్యాధి సోకినప్పుడు కండరాలు విపరీతంగా బాధిస్తాయి. ఆ బాధని దిగమింగుతూ చికిత్స చేయించుకున్న సామ్ తిరిగి ఫిట్ గా మారింది. కాస్త తీరిక దొరకడంతో సమంత తమిళనాడులోని పళని మురుగన్ స్వామి దేవాలయాన్ని సందర్శించింది. సమంత 600 మెట్లు ఎక్కడం మాత్రమే కాదు.. మెట్టు మెట్టుకూ కర్పూరం వెలిగిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. సమంత టీంతో పాటు.. జాను (తమిళంలో 96) చిత్ర దర్శకుడు సి ప్రేమ్ కుమార్ కూడా సమంత దర్శన ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు.