బిగ్ బాస్ 4 : హౌజ్ లో పులిహోర రాజాలు.. చీపురు తిరగేసిన గంగవ్వ..

Sep 16, 2020, 12:09 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రోజురోజుకూ ఊపందుకుంటోంది. మంగళవారం ఎపిసోడ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులకు మస్తు మజాని ఇచ్చింది. ఎపిసోడ్ మొత్తం పులిహోర కలపడం, గంగవ్వ చీపురు తిరగేయడం, మోనాల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ట్రాక్ తో పాటు  దేత్తడి హారిక లవ్ ట్రాక్.. మెహబూబ్ కండల ప్రదర్శనతో సరదా సరదాగా సాగిపోయింది.