Dec 13, 2019, 7:01 PM IST
కసాయి తల్లి కర్కశత్వానికి అభంశుభం తెలియని పురిటి పసికందు మురికి కాలువలో విగత జీవిగా దర్శనమిచ్చింది. ఈ దారుణం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామంలో చోటుచేసుకుంది. అప్పుడే జన్మించిన ఆడ శిశువు మృతదేహం మురికి కాలువలో కనిపించడం స్థానికులను కలచివేసింది. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాప మృతదేహాన్ని అక్కడినుండి తరలించారు. ఈ దారుణానికి పాల్పడిన వారు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.