తణుకులో భారీ అగ్నిప్రమాదం, 30 లక్షల ఆస్తినష్టం (వీడియో)

Oct 20, 2019, 6:50 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని 29వ వార్డు  మల్లికాసులపేటలో మంటలు చెలరేగి దాదాపు 40 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు  30 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. ఒక ఇంటిలోని మహిళ గ్యాస్ స్టవ్ వెలిగించడం వలన పొరపాటున మంటలు చెలరేగి దగ్ధమైందని స్థానికులు చెబుతున్నారు.