సంజూ శాంసన్ ను థోనీతో పోల్చిన థరూర్.. మండిపడ్డ గంభీర్, శ్రీశాంత్...

28, Sep 2020, 6:47 PM

ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శాంసన్ అదరగొడుతున్నాడు. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో 32 బంతుల్లో 72 రన్స్ బాది రాజస్థాన్ 216 రన్స్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రెండో మ్యాచ్‌లోనూ శాంసన్ అదరగొట్టాడు. 224 పరుగుల రికార్డ్ స్థాయి లక్ష్య చేధనలో ఏ మాత్రం బెదరకుండా.. స్మిత్‌తో కలిసి ఎదురు దాడికి దిగాడు. 4 ఫోర్లు, 7 సిక్సులు బాదిన శాంసన్.. 42 బంతుల్లోనే 85 రన్స్ చేశాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు చేసి.. రాజస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన శాంసన్.. రెండుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.