Feb 12, 2023, 12:35 PM IST
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ను మించిన వెన్నుపోటుదారుడు తెలంగాణలోనే లేరంటూ ఎద్దేవా చేసారు. అసెంబ్లీ సాక్షిగా పోడుభూముల పంపిణీపై కేసీఆర్ ప్రకటన చేసారు... ఇదీ వారిని మోసగించే వాగ్దానమేనని అన్నారు. పోడుభూములు పొందాలంటే సర్పంచ్, ఎంపిటీసి ఇలా ఎవడెవడో సంతకాలు పెట్టాలంటా... ఏదో కేసీఆర్ తన సొంత ఆస్తో, ఫార్మ్ హౌసో రాసిస్తున్నట్లుగా షరతులు పెడుతున్నాడని అన్నారు. తెలంగాణ ప్రజల ఆస్తిని వారిని పంచడాన్ని ఏదో
మీ ఆస్తి ఇస్తున్నట్లు ఫీల్ కాకండి... బేషరుతుగా పోడు భూములకు పట్టాలివ్వాలి అని షర్మిల డిమాండ్ చేసారు.