గాల్లో విమానం ఊగిపోతుంటే... మా పరిస్థితి ఎలా వుండిందంటే..: ఎమ్మెల్యే రోజా

Dec 14, 2021, 4:32 PM IST

బెంగళూరు: వైసిపి ఎమ్మెల్యే రోజా, టిడిపి ఎమ్మెల్యే జోగేశ్వర రావు, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడికి పెను ప్రమాదం తప్పింది. వీరు రాజమండ్రి నుంచి తిరుపతికి వెళుతున్న ఇండిగో విమానంలో ల్యాండింగ్ సమస్య తలెత్తింది. తిరుపతి ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సాధ్యం కాక దాదాపు గంటసేపు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. అయితే చివరకు విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. గాల్లో విమానం ఊగిపోతూ తిరుపతిలో ల్యాండ్ కాకపోవడంతో గంటసేపు ఇబ్బంది పడ్డామన్నారు. వాతావరణ సమస్య అని అన్నారే తప్ప విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ అని చెప్పలేదన్నారు. ఇండిగో సంస్థపై కోర్టులో కేసు వేస్తానని ఎమ్మెల్యే రోజా తెలిపారు. ysrcp, rk roja, ap news, TDP, Yanamala ramakrishnudu, indigo plane, bangalore, వైసిపి, రోజాకు తప్పిన ప్రమాదం, ఏపీ వార్తలు