Jan 13, 2023, 12:51 PM IST
తాడేపల్లి : శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ 'యువశక్తి' బహిరంగ సభలో సీఎం జగన్, మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు, నాయకులపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటరిచ్చారు. పవన్ నోటిజాడింపు మానకుంటే మా దగ్గరా చెప్పులున్నాయంటూ నాని ఘాటు వ్యాఖ్యలు చేసారు. తన చేతికి అందేలా ముందుకొచ్చి పవన్ మాట్లాడితే అప్పుడు తగినట్లు సమాధానం చెబుతానని నాని హెచ్చరించారు. చెడిపోయిన వ్యక్తిత్వంతో పెద్ద నాయకుడిగా ఫోజులు కొడుతూ సొల్లు కబుర్లు, ఊకదంపుడు ఉపన్యాసాలివ్వడం మానుకోవాలని పవన్ కు నాని హెచ్చరించారు. చంద్రబాబుతో వెళ్లిపోతున్నానని చెప్పడానికే పవన్ సభ పెట్టాడన్నారు. అన్నయ్య చిరంజీవి ప్రజాశాంతిని వదిలేసి సొంతపార్టీ, ఆ తర్వాత బిజెపి, సిపిఐ, సిపిఎం ఇప్పుడు టిడిపితో పవన్ తిరుగుతున్నాడని... దీన్ని రాజకీయ వ్యభిచారం అంటారని నాని సంచలన వ్యాఖ్యలు చేసారు.