కోవిద్ 19 పరీక్ష మీద ప్రజల్లో భయాన్ని తొలగించడానికి ఎమ్మెల్యే రోజా పూనుకున్నారు. దీంట్లో భాగంగా పోలీసులు, రెవెన్యూ అధికారులకు దగ్గరుండి మరీ కోవిద్ 19 పరీక్షలు చేయించారు. టెస్ట్ కి శాంపిల్ తీయడం చాలా ఈజీ అని.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాకే శాంపిల్ కలెక్ట్ చేస్తారు కాబట్టి భయపడవద్దని పిలుపునిచ్చారు.