Dec 9, 2019, 10:59 AM IST
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని విలియంపేట ప్రాంతంలో గత నెలరోజులుగా మంచినీటి సరఫరా జరగడం లేదంటూ మహిళలు బిందెలతో రోడ్డుమీద బైఠాయించారు. నాలుగైదు సార్లు మున్సిపల్ ఆఫీసులో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనున్న చెరువుకు పోదామంటే కోతులబెడద ఉందని తమకు న్యాయం జరగాలని మహిళలు డిమాండ్ చేశారు.