Jul 13, 2020, 11:59 AM IST
విశాఖపట్నం జిల్లా ఏటి గైరంపేట గ్రామంలో రేషన్ డిపో లో ప్లాస్టిక్ బియ్యం వచ్చాయని , తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గొలుగొండ రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఎక్కడ ప్లాస్టిక్ బియ్యం రాలేదని కావాలనే ఒక వర్గం వారు ప్రభుత్వంపై బురద జల్లడం కోసం ఇలా వ్యవహరించారని సివిల్ సప్లై అధికారులు తెలియజేశారు. రేషన్ షాప్ వద్ద నుంచి బియ్యం తీసుకెళ్లిన వారి ఇంటికి వెళ్లి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎక్కడా ప్లాస్టిక్ బియ్యం వచ్చినట్టుగా నిర్ధారణ కాలేదని తెలిపారు. ప్రభుత్వంపై ఎవరైతే తప్పుడు వార్తలు ప్రచారం చేశారో, ఆ ఎలక్ట్రానిక్ మీడియా చానళ్లపై గ్రామానికి చెందిన పలువురుపై కేసు నమోదు చేయాలని అధికారులు ఫిర్యాదు చేశారు.