Jul 26, 2023, 2:52 PM IST
విజయవాడ : కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లే దారిలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడుతుండటంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా గత రాత్రి నుండి ఘాట్ రోడ్డుపై రాకపోకలను నిలిపివేసారు. ప్రస్తుతం ఘాట్ రోడ్డుపై పడిన కొండచరియల్ని తొలగించి రాకపోకలను పునరుద్దరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అప్పటివరకు కనకదుర్గ నగర్ లోని లిఫ్ట్ మార్గం ద్వారా భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని దర్శించుకునే సౌకర్యం కల్పిస్తున్న అధికారులు తెలిపారు.