Jan 12, 2023, 11:38 AM IST
విశాఖపట్నం : తెలుగురాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభానికి ముందే అపశృతి చోటుచేసుకుంది. ఈ నెల 19న హైదరాబాద్ - విశాఖపట్నం మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభిచాలని భావించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై కొందరు దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ట్రయల్ రన్ లో భాగంగా చెన్నై నుండి విశాఖపట్నం వెళుతున్న రైలుపై కంచరపాలెం వద్ద గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడిచేసారు. ఈ దాడిలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ కిటీకి అద్దాలు పగిలిపోయినట్లు వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ అనుప్ కుమార్ సత్పతి తెలిపారు. ఈ నెల 19న తెలంగాణ, ఏపీ మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో జెండా ఊపి ప్రారంభించాల్సి వుంది. అయితే అనివార్య కారణాల వల్ల ప్రధాని పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది.