Jun 7, 2020, 3:38 PM IST
దాదాపు 80 రోజుల తరువాత కలియుగ వైకుంఠ మూర్తి దర్శనం ఇవ్వబోతున్నాడు .కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వటంతో తి తి దే కూడా అన్ని ఏర్పాట్లు చేసి దేవుని దర్శనానికి విధి విధానాలను ఏర్పాటు చేసింది .ఉదయం 6 .30 నుండి రాత్రి 7 .30 వరకే దర్శనానికి అనుమతి ఇస్తారు శ్రీవారి మూలమూర్తి దర్శనం తప్ప వకుళ మాత ,యోగ నరశింమః స్వామి ఆలయాల దర్శనానికి అనుమతి లేదు .తీర్ధ ప్రసాదాల వితరణ ఉండదు .ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి ఉండదు .ప్రోటోకాల్ వున్నా వ్యక్తులు స్వయంగా వస్తే వారికీ మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది .సిఫారసు లేఖలు చెల్లవు