Aug 3, 2020, 6:10 PM IST
కర్నూల్ జిల్లా పత్తికొండలో నిన్న రాత్రి 2 గంటల సమయంలో మొబైల్ షాపు, గోల్డ్ షాపుల్లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో సుమారు 4 లక్షలు విలువచేసే బంగారం,సెల్ఫోన్లు దొంగ ఛోరీ అయ్యాయి. పోలీస్ స్టేషన్ కాంపౌండ్ గోడ పక్కనే ఉన్న KBN మొబైల్ షాపులో దొంగతనం చేసి, దగ్గర్లోని బంగారం షాపులోని cc కెమెరా ద్వంసం చేశాడు. ఆ తరువాత బంగారు షాపులో చోరీకి ప్రయత్నించి షట్టర్ ఓపెన్ కాకపోవడంతో, మరికొంత దూరంలో ఉన్న మరో బంగారుషాప్ లో దొంగతనం చేశాడు. నగలను తీసుకుని బాక్సులను పక్కనే ఉన్న కాలువలో పడేసి పరారయ్యాడు