కొన్ని దశాబ్దాలుగా త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తెలుగులో వర్షం చిత్రంతో హవా మొదలు పెట్టిన త్రిష ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ప్రభాస్, మహేష్, పవన్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఇలా అగ్ర హీరోలందరితో త్రిష సినిమాలు చేసింది. తమిళంలో కూడా త్రిష టాప్ హీరోయినే. నాలుగు పదుల వయసులో కూడా త్రిష హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది.
కెరీర్ బిగినింగ్ నుంచి త్రిష గురించి ఏదో ఒక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమె గురించి సంచలన రూమర్స్ వైరల్ అవుతున్నాయి. పెళ్ళైన స్టార్ హీరోతో త్రిష ఎఫైర్ పెట్టుకున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇవి రూమర్స్ మాత్రమే. కానీ ఈ రూమర్స్ కి బలం చేకూరుస్తూ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు దళపతి విజయ్.
త్రిష, విజయ్ కలసి గిల్లి, తిరుప్పాచ్చి, లియో లాంటి అనేక చిత్రాల్లో నటించారు. దీనితో వీరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. తరచుగా త్రిష విజయ్ పై అభిమానం చూపిస్తూనే ఉంటుంది. ఇటీవల వీరి సాన్నిహిత్యం బాగా పెరిగింది అని.. క్లోజ్ గా ఉంటున్నారు అని తమిళ సినీ వర్గాల్లో హాట్ హాట్ రూమర్స్ వినిపిస్తున్నాయి. త్రిష కారణంగా విజయ్ పర్సనల్ లైఫ్ లో కూడా డిస్ట్రబెన్స్ వచ్చినట్లు ఆ మధ్యన రూమర్స్ వచ్చాయి. విజయ్, అతని భార్య సంగీత మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరిగింది.
రీసెంట్ గా దళపతి విజయ్ గోవాలో కీర్తి సురేష్ వివాహానికి హాజరయ్యారు. విజయ్ ఒక్కడే వెళ్లలేదట. విజయ్ త్రిష ఇద్దరూ ప్రైవేట్ జెట్ లో కలసి గోవాకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎయిర్ పోర్ట్ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వీరి మధ్య ఏమీ లేకుంటే ప్రైవేట్ జెట్ లో వెళ్లాల్సిన అవసరం ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విజయ్ భార్య సంగీతకి న్యాయం జరగాలి అంటూ త్రిషపై దుమ్మెత్తి పోస్తూ ట్రోల్ చేస్తున్నారు.
మరి ఈ రూమర్స్ ఎంత వరకు వెళతాయో చూడాలి. త్రిష లియో చిత్రంలో విజయ్ కి జోడిగా నటించింది. ఆ తర్వాత విజయ్ నటించిన ది గోట్ చిత్రంలో త్రిష స్పెషల్ సాంగ్ చేసింది. ఇటు పర్సనల్ గా అటు ప్రొఫెషనల్ గా విజయ్, త్రిష మధ్య బాండింగ్ పెరుగుతోంది అనేది సంచలనంగా మారింది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఇలాంటి రూమర్స్ ఎటువైపు దారితీస్తాయో చూడాలి.