ఉల్లిపాయ లేని కూర ఉండదంటే నమ్మండి. ప్రతి ఒక్క కూరలో మనం ఉల్లిపాయల్ని ఖచ్చితంగా వేస్తాం. ఎందుకంటే దీనివల్ల వంట టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇదొక్కటి మాత్రమే కాదు.. ఉల్లిపాయ మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
అయితే ఒక్కొక్కరు ఉల్లిపాయల్ని ఒక్కోవిధంగా తింటుంటారు. అంటే కొంతమంది ఉల్లిపాయల్ని అప్పటికప్పుడు ఫుడ్ లో కలుపుకుని తింటుంటారు. మరికొంతమంది ఉదయం, మధ్యాహ్నం లేదా సాయంత్రం పచ్చి ఉల్లిపాయల్ని తింటుంటారు. ఉల్లిపాయల వల్ల ప్రయోజనాలు ఉన్నా.. వీటిని పొందాలంటే మాత్రం వీటిని సరైన సమయంలోనే తినాలి.
ఉల్లిపాయలలో ఉండే పోషకాలు
ఉల్లిపాయల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ విటమిన్ బి2, విటమిన్ సి, విటమిన్ కె లు మెండుగా ఉంటాయి. అలాగే థయామిన్, సల్ఫర్, యాంటీఆక్సిడెంట్లు వంటి ఎన్నో రకాల పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
ఉల్లిపాయలను తినడానికి సరైన సమయం ఏది?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఉల్లిపాయల్ని ఎప్పుడైనా తినొచ్చు. కానీ పచ్చి ఉల్లిపాయల్ని ఉదయం పరిగడుపున తినడం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఉల్లిపాయల్లో ఉండే విషాన్ని తొలగించే లక్షణాలు మన శరీరాన్ని ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతాయి.
ఉదయం పరిగడుపున పచ్చి ఉల్లిపాయల్ని తినడం వల్ల మన శరీరంలోని విషం బయటకు పోతుంది. అలాగే కాలెయ పనితీరు కూడా మెరుగుపడుతుంది. అలాగే వీటిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగే తిన్న ఆహారం నుంచి పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది.
ఉల్లిపాయల్ని మధ్యాహ్నం లేదా రాత్రిపూట తినడం వల్ల ఫుడ్ నుంచి పోషకాలను శరీరం బాగా గ్రహిస్తుంది. ఉల్లిపాయల్లో ఉండే ప్రీబయోటిక్ మన కడుపులో మంచి బాక్టీరియా సంఖ్యను పెంచుతుంది. అలాగే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
ఉల్లిపాయలను ఎలా తినడం మంచిది?
ఉల్లిపాయల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. కానీ పచ్చిగా తింటే మంచిదా? లేదా వండుకుని తినడం మంచిదా? అన్న డౌట్ చాలా మందికి వస్తుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పచ్చి ఉల్లిపాయలు లేదా వండుకుని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి ఉల్లిపాయల్లో పుష్కలంగా విటమిన్లు,సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. వండిన ఉల్లిపాయల్ని తింటే ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. కానీ ఉల్లిపాయలను వండుకుని తినడం కంటే పచ్చిగా తింటేనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఉల్లిపాయలు తినడానికి సరైన మార్గం ఏమిటి?
ఉల్లిపాయల్ని ఎన్నో విధాలుగా తినొచ్చు. అంటే కూరల్లో, సలాడ్ లేదా రైతాలో వేసుకుని తినొచ్చు. దీనివల్ల మీరు తినే ఫుడ్ లో పోషకాలు మరిన్ని పెరుగుతాయి. అంతేకాదు ఉల్లిపాయలపై నిమ్మరసం పిండి తింటే ఐరన్, ఇతర ఖనిజాలను మీ శరీరం బాగా గ్రహిస్తుంది. ముఖ్యంగా శరీరంలో కొవ్వులో కరిగే పోషకాలను మీ శరీరం బాగా గ్రహించడానికి ఇది సహాయపడుతుంది. ఆలివ్ నూనె లేదా నెయ్యితో ఉల్లిపాయల్ని వండుకుని తింటే మంచిది.