Dec 17, 2019, 5:07 PM IST
కర్నూలు, కొలిమిగుండ్ల మండలం బెలుము గుహల వద్ద టీడీపీ కార్యకర్త సుబ్బారావు అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఓ హోటల్ దగ్గర టీ తాగుతుండగా అతి కిరాతకంగా కత్తులతో నరికి, బండ రాళ్లతో మోది చంపారు. హత్య చేసింది వైసీపీ నాయకులని చెబుతున్నారు. చింతలాయిపల్లె గ్రామం కొలిమిగుండ్ల మండలం మృతుని స్వగ్రామం. హత్యకు గురైన సుబ్బారావు బనగానపల్లె టిడిపి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. గ్రామంలో ఆధిపత్య పోరే హత్యకు కారణం అని తెలుస్తోంది.