టిడిపికి ఓటేశాడని సామాన్యుడి ఇంటిని కూలుస్తారా?: నరసరావుపేట ఘటనపై వర్ల ఆగ్రహం

Feb 16, 2021, 5:04 PM IST

గుంటూరు: నరసరావుపేట మండలంలో  వైసిపి విద్వంసాల వల్ల నష్టపోయిన బాధితులను పరామర్శించారు టిడిపి ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు , నక్కా ఆనంద బాబు, జి.వి. ఆంజనేయులు, చదలవాడ అరవింద బాబు. పంచాయతీ ఎన్నికలలో టిడిపి బలపర్చిన అభ్యర్థికి మద్దతుగా పనిచేశాడని ఇస్సాపాలెంలో ఓ వ్యక్తి ఇంటిని కూల్చివేయడానికి అధికారులపై ఒత్తిడి తెచ్చి వైసిపి నాయకులు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ సందర్భంగా వర్ల మాట్లాడుతూ... నిర్మాణాలు కూల్చివేత అమానుషమన్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే పేరుకే డాక్టర్ అని... గోపిరెడ్డికి ఏమాత్రం మానవత్వం లేదన్నారు. ఓటు వేయకుంటే కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడతారా? ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని బెదిరిస్తారా? టిడిపి  వారి ఇళ్లపై ఇంత అరాచకాలు చేస్తారా? అని వర్ల ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఇలాంటి ఘటనపై దృష్టి సారించాలని సూచించారు. పోలీసుల సరిగా వ్యవహరించాలని... చట్టం ప్రకారం నడచుకోవాలని... ఎమ్మెల్యే చెప్పినట్లు వింటే అధికారులు  ఇబ్బందులు పడతారని వర్ల హెచ్చరించారు.