విశాఖలో విషవాయువు లీకేజి, పిట్టల్లా రాలుతున్న జనాలు!

May 7, 2020, 9:16 AM IST

విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి విషవాయువు విడుదలై ప్రమాదం సంభవించింది. అర్థరాత్రి సుమారు 2 నుంచి మూడు గంటల మధ్య ప్రాంతాల్లో ఈ కంపెనీలోని విషవాయువు స్టైరిన్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించింది. చుట్టుపక్కల కనీసం 20 గ్రామాలకు ఈ వాయువు వ్యాపించింది. ఇప్పటికే ముగ్గురు మరణించగా వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.