Feb 26, 2021, 11:03 AM IST
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయ గోపురంపై వింత పక్షి కలకలం రేపుతుంది. గత 15 రోజుల నుంచి ఆలయ గోపురాలపై ఉంటూ వింత శబ్దాలు చేయటం.. కేవలం రాత్రి సమయంలో బయటికి కనిపిస్తోంది. దీంతో ఆ పక్షిని చూసేందుకు, విత శబ్దాలను వినేందుకు గుంపులు గుంపులుగా స్థానికులు ఆలయం వద్దకు వస్తున్నారు. ఈ క్రమంలోనే పక్షి ఏది అనేది నిర్ధారణ కోసం టార్చ్ లైట్ వేసి చూస్తూ ఉండటతో ఒక్కసారిగా వింత పక్షి అక్కడి నుంచి ఎగిరిపోయింది.