Jul 22, 2020, 5:05 PM IST
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసీగా నియమించి హైకోర్టు ఉత్తర్వులను తక్షణమే అమలుచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గవర్నర్ ఆదేశించడం ప్రజాస్వామ్య విజయం అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని, విలువలను కాపాడటంలో పొరపాట్లు చేయకుండా ప్రవర్తిస్తుందని ఆశిస్తున్నాం అన్నారు.