Jul 30, 2020, 3:40 PM IST
సింహాచలం దేవస్థానం కొత్త సొబగులు అద్దుకోనుంది. రాష్ట్రంలోనే గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందనుంది. ఇందుకోసం కేంద్ర పర్యాటక శాఖ సింహాచలం దేవస్థానాన్ని ‘ప్రసాద్’ (తీర్థయాత్రా స్థలాల నవీకరణ, ఆధ్యాత్మిక పెంపుదల) పథకానికి ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటక శాఖ మూడు ఆలయాలకు సంబంధించిన సవివర నివేదికలు పంపగా వాటిల్లో సింహాచలం ఆలయాన్ని ఎంపిక చేసినట్లు కేంద్ర పర్యాటక శాఖ పేర్కొంది.