Dec 6, 2019, 8:27 PM IST
విశాఖపట్నం: ఈశాన్య నావికాదళం ఎన్‌సిసి విద్యార్థులకు ఓ అరుదైన అవకాశాన్ని కల్పించింది. సాగర సాహస్ పేరుతో విశాఖపట్నం నుండి కాకినాడకు అక్కడినుండి తిరిగి మళ్లీ విశాఖకు సముద్రయానం చేసే అవకాశాన్ని ఎన్‌సిసి విద్యార్థులకు కల్పించింది. ఇలా దాదాపు 400 కిలోమీటర్ల సాహసయాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర బృందంలో 60 మంది సీనియర్ డివిజన్ లేదా వింగ్ క్యాడెట్లు (20 మంది బాలికలతో సహా), ఇద్దరు ఎఎన్‌వో లు మరియు 15 మంది నావికాదళ సిబ్బంది మరియు ఇద్దరు నావికాదళ అధికారులు ఉన్నారు.