పీపీఈ కిట్లు ధరించి.. అంత్యక్రియలు చేసిన ఎస్సై.. భేష్ అంటున్న స్థానికులు..

Jul 20, 2020, 5:50 PM IST

కర్నూలు జిల్లా ప్యాపిలీలో ఓ అరుదైన సంఘటన జరిగింది. మండల కేంద్రంలో ఓ కిరాణాషాపు యజమాని హఠాత్తుగా చనిపోయాడు. ఆయన కరోనాతోనే చనిపోయాడనే అనుమానంతో బంధువులెవ్వరూ ఆంత్యక్రియలు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో సమాచారం అందుకున్న ప్యాపిలి ఎస్సై ఎస్సై మారుతి శంకర్ స్వయంగా బ్యాటరీ ఆటోలో మృతదేహాన్ని ఊరిబయట ఉన్న స్మశాన వాటిక దగ్గరకు తీసుకెళ్ళి దహాన సంస్కారాలు జరిపించి మానవత్వం చాటుకున్నాడు.