Jan 20, 2022, 1:26 PM IST
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ సచివాలయానికి వెళ్లే మార్గంలో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ వినూత్న నిరసనకు దిగారు. సచివాలయం, హైకోర్టుకు వెళ్లే బస్సులను ఆపి అందులోని ఉద్యోగులను అమరావతికి మద్దతు ఇవ్వండి... మీ ఉద్యోగుల ఉద్యమానికి మేము మద్దతు ఇస్తాం అంటూ గులాబీ పూలను పంపిణీ చేసారు కొలికపూడి శ్రీనివాస్. జగన్ బాధితులారా ఏకం కండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. రెండేళ్లుగా అమరావతి ప్రజలు ఉద్యమిస్తుండగా ఇప్పుడు ఉద్యోగులు కూడా ఉద్యమంలోకి వెళుతున్నారని... జగన్ బాధితులందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని కొలికపూడి పేర్కొన్నారు.