కృష్ణా జిల్లా : టిడిపి నిజనిర్ధారణ కమిటీని పామర్రు వద్ద అడ్డుకున్న పోలీసులు...

Jan 21, 2022, 1:02 PM IST

కృష్ణా జిల్లా : టిడిపి నిజనిర్ధారణ కమిటీ ని పామర్రు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. గుడివాడ క్యాసినో వ్యవహారంలో నిర్ధారణ జరిపేందుకు టిడిపి నాయకులు వెళ్తున్నారు. అయితే ఒకే వాహనానికి అనుమతి ఉందని పోలీసులు చెప్పండంతో టిడిపి నాయకులు వాగ్వివాదానికి దిగారు. దీంతో కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొడాలి కన్వెన్షన్ సెంటర్‌కు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. గుడివాడలో ఇవాళ తెదేపా నిజనిర్ధరణ కమిటీ పర్యటిస్తోంది. గుడివాడలో క్యాసినో నిర్వహించిన ప్రదేశం పరిశీలించనున్న కమిటీ సభ్యులు.. వీరు ఎన్టీఆర్ భవన్ నుంచి బయల్దేరారు. కమిటీ సభ్యులుగా నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, ఆలపాటి, తంగిరాల సౌమ్యలు ఉన్నారు. తమ పర్యటన తరువాత వీరు పూర్తిస్థాయి నివేదికను తెదేపా అధిష్ఠానానికి ఇవ్వనున్నారు.