Jan 10, 2023, 1:29 PM IST
ఒంగోలు : ప్రేమిస్తున్నానని వెంటపడి మాయమాటలతో నమ్మించిన పోలీస్ కానిస్టేబుల్ మోసం చేసాడంటూ ఓ మహిళ ప్రకాశం జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. మైనంపాడు వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్యామల తనను ఏఆర్ కానిస్టేబుల్ పల్లెపాటి అర్జున్ శారీరకంగా వాడుకుని ఇప్పుడు వదిలేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. ప్రియుడి మాయమాటలు నమ్మి శారీరకంగా కూడా దగ్గరయ్యానని... దీంతో గర్భం దాల్చగా అబార్షన్ కూడా చేయించాడని యువతి ఆరోపిస్తోంది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అడిగితే ఏకంగా దాడులకు తెగబడ్డాడని తెలిపారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో స్పందన కార్యక్రమంలో పాల్గొని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు శ్యామల తెలిపారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె ప్రకాశం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను కోరారు.