vuukle one pixel image

మాజీ మంత్రులు అయ్యన్న, రాజప్ప, ఆనంద్ బాబు అరెస్ట్

Jul 9, 2021, 5:29 PM IST

అమరావతి: విశాఖపట్నం-తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దుల్లో బాక్సైట్‌ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన టీడీపీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనందబాబుతో పాటు టిడిపి శ్రేణుల అరెస్ట్‌కు పోలీసులు యత్నించారు. దీంతో తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమను అక్రమంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన పోలీసులపై మాజీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను టచ్ చేయొద్దంటూ పోలీసులపై అయ్యన్న ఫైర్ అయ్యారు. పోలీసుల నుంచి కరోనా సోకితే ఎవరు బాధ్యులు అని అయ్యన్నను ప్రశ్నించారు.