Ather 450 అధునాతన మోడల్ లో డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డిజిటల్ ట్రిప్ మీటర్, ఓడో మీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్, సేఫ్టీ బ్రేకింగ్ సిస్టమ్, ట్యూబ్‌లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్ ఇలా లేటెస్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Ather 450 స్కూటర్ ఏరోడైనమిక్ డిజైన్ ను కలిగి ఉంది. కొత్త కలర్ స్కీమ్, గ్రాఫిక్స్ తో తయారైంది. అందువల్ల దాని కొత్త లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. LED లైట్లు లేటెస్ట్ మోడల్ గా తయారయ్యాయి. చాలా పవర్ ఫుల్ గా ఉండటం వల్ల ఎక్కువ కాంతినిస్తాయి. ఈ స్కూటర్ బిల్డ్ క్వాలిటీ చాల పర్ఫెక్ట్ గా ఉంది. లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండటం వల్ల వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.