బ్లాక్ కాఫీ, మిల్క్ కాఫీ.. ఏ కాఫీ బెస్ట్?

Published : Jan 23, 2025, 11:46 AM ISTUpdated : Jan 23, 2025, 12:04 PM IST

మనలో చాలా మందికి ఉదయాన్నే ఓ కప్పు కాఫీ తాగకపోతే రోజు స్టార్ట్ కాదు. కొందరికైతే పొద్దున్నే కాఫీ కడుపులో పడకపోతే ఏ పని తోచదు. బ్రెష్ చేసి కొందరు, చేయకుండానే మరికొందరు వారికి నచ్చిన కాఫీని ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే ఏ కాఫీ మన ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.  

PREV
15
బ్లాక్ కాఫీ, మిల్క్ కాఫీ.. ఏ కాఫీ బెస్ట్?

చాలా మందికి ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ మంచి ఎనర్జీ డ్రింక్ అని చెప్పొచ్చు. ఎక్కువమంది కాఫీ తాగి రిఫ్రెష్ అవుతుంటారు. కాఫీ టేస్ట్, స్మెల్ మంచి అనుభూతినిస్తుంది. కాఫీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఉదయాన్నే ఏ కాఫీ తాగితే మన ఆరోగ్యం బాగుంటుందో చూద్దాం.

 

25
కాఫీతో జ్ఞాపకశక్తి పెరుగుతుందా?

బ్లాక్ కాఫీ

బ్లాక్ కాఫీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ కాఫీ తాగడం వల్ల చాలా ఆక్టివ్ గా ఉంటారు. నిద్రకు కారణమయ్యే అడెనోసిన్ అనే రసాయనాన్ని ఇది బ్లాక్ చేస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరిచే డోపమైన్ విడుదలకు మెదడును ప్రేరేపిస్తుంది. అసిటైల్కోలిన్ లాంటి న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

35
బరువు తగ్గడానికి కూడా..

మితంగా బ్లాక్ కాఫీ తాగడం వల్ల స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. బ్లాక్ కాఫీలోని పాలీఫెనాల్స్ వాపును తగ్గించడంలో సాయపడతాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు బరువును నియంత్రిస్తాయి. కాఫీలోని కెఫిన్ శరీర శక్తిని పెంచి.. పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకే ఫిట్‌నెస్ ఔత్సాహికులు, బరువు తగ్గాలనుకునే వారు బ్లాక్ కాఫీ తాగుతుంటారు.

 

45
ఎముకలు బలంగా..

మిల్క్ కాఫీ

మిల్క్ కాఫీలో కాల్షియం, విటమిన్ డి, ఇతర ఖనిజాలు ఉంటాయి. ప్రతిరోజూ మిల్క్ కాఫీ తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి, ఫ్రాక్చర్స్ లాంటి ఎముకలకు సంబంధించిన వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. మిల్క్ కాఫీ వృద్ధులకు ప్రోటీన్, విటమిన్లు B2, B12, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలను అందిస్తుంది. ఇవి కండరాల పనితీరు, నాడి పనితీరు, శక్తి ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. మిల్క్ కాఫీలోని ప్రోటీన్ అతి ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గడంలోనూ సాయపడుతుంది.

 

55
ఏది మంచిది?

రెండు రకాల కాఫీలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. డయాబెటిక్ పేషెంట్లకు బ్లాక్ కాఫీ మంచిది. తక్కువ కేలరీలు, కొద్దిగా చేదు రుచిని ఇష్టపడేవారు బ్లాక్ కాఫీని ఎంచుకోవచ్చు. ఎక్కువ కేలరీలు, తియ్యటి పానీయాన్ని ఇష్టపడేవారికి మిల్క్ కాఫీ బెస్ట్.

 

Read more Photos on
click me!

Recommended Stories