కూరల్లో పులుపు తగ్గాలంటే ఏం చేయాలి?
బెల్లం వాడాలి
బెల్లంతో తీపి వంటకాలను చేస్తాం. ఇది అందరికీ తెలుసు. కానీ ఈ బెల్లంతో కూరల్లో పులుపును బ్యాలెన్స్ చేయొచ్చు తెలుసా? బెల్లం తీపి పులుపును సమతుల్యం చేయడమే కాకుండా కూరల్ని మరింత టేస్టీగా, కొత్తరుచిని ఇస్తుంది. కూరల గ్రేవీలో పులుపును నార్మల్ చేయడానికి దానిలో 2 టీస్పూన్ల బెల్లాన్ని వేసి బాగా కలపండి. కానీ ఎక్కువగా మాత్రం వేయకండి. లేదంటే కూరల టేస్ట్ తీయగా, డిఫరెంట్ గా అవుతుంది.