Google లో డాటా సైన్స్ కోర్సు వల్ల లాభాలు :
గూగుల్ లో ఢాటా సైన్స్ కోర్చు ఉచితమే. కానీ దీని ప్రభావం మన కెరీర్ చాలా వుంటుంది. ఈ కోర్సు చేసినతర్వాత మీ కెరీరే మలుపుతిరిగే అవకాశాలుంటాయి. మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ కోర్సు ఇంత స్పెషల్ ఎందుకో తెలుసుకుందాం.
గూగుల్ బ్రాండ్ :
గూగుల్ అనేది ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుపొందిన సంస్థ. టెక్నాలజీ రంగంలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో కోర్సు చేయడం మీ కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది.
సమగ్ర అవగాహన :
గూగుల్ అందించే ఈ కోర్సు ద్వారా డాటా విశ్లేషణ, మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టికల్ మెథడ్స్ గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఇది ప్రెషర్స్ గా కెరీర్ ప్రారంభించేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
అనుభవం :
ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టులను ఉదహరించే ఈ కోర్సులను కొనసాగిస్తారు. అంటే ఇప్పుడు ఉద్యోగం చేసేవారి పనితీరు గురించి అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ కోర్స్ ద్వారా నాలెడ్జ్ పొందడమే కాదు అనుభవాన్ని పొందవచ్చు.
సౌకర్యవంతమైన అభ్యాసం :
గూగుల్ అందించే ఈ డాటా సైన్స్ కోర్సు స్వతహాగా నేర్చుకునే విధంగా రూపొందించారు. అంటే యువత ఓవైపు తమ స్టడీని కొనసాగిస్తూనే ఈ కోర్సును కూడా పూర్తిచేయవచ్చు. వారి చదువుకు ఇది ఎలాంటి ఆటంకం కలిగించదు. ఇలా చాలా సౌకర్యవంతంగా ఈ కోర్సును తీర్చిదిద్దింది గూగుల్.