Nov 9, 2021, 5:40 PM IST
గుంటూరు: నరసరావుపేటలోని తిలక్ స్కూల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన కోడిగుడ్లలో కుళ్ళిపోయినవి, పురుగులతో కూడినవి వచ్చాయని విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపించారు. ఉడికీ ఉడకని అన్నం తినలేక విద్యార్థులు వాంతులు,విరేచనాలు చేసుకున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు పెట్టిన నాసిరకం బోజనాన్ని వీడియో తీసి సామాజిక మాద్యమాల్లో పెట్టారు.