కృష్ణా జిల్లాలో ఘోరం... ఆర్టీసి బస్సు-లారీ ఢీ, ఒకరు మృతి

Mar 9, 2022, 11:42 AM IST

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచచేసుకుంది. కంచికచర్ల మండల పరిధిలోని పరిటాల శివారు బైపాస్ పై వేగంగా వెళుతున్న ఏపీఎస్ ఆర్టీసి వెన్నెల బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ సిహెచ్ మూర్తి(50) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు నూజివీడు గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని ముందుగా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం క్లీనర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.