Dec 15, 2020, 5:16 PM IST
జూమ్ యాప్ లో మాత్రమే ప్రత్యక్షమే... ప్రజల్లోకి రాకుండా రాష్ట్రం మీద ప్రేమ ఉన్నట్టు చంద్రబాబు నటిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. కృష్ణాజిల్లా తిరువూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో కాస్సేపు వున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.... రాష్ట్రానికి ఒక విజిటర్ గా మారిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబేనని అన్నారు. చంద్రబాబు, అతని కొడుకు పప్పు లోకేష్, అతని చెంచా పవన్ కళ్యాణ్ ఏదో రకంగా ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం రోజు చేపడుతున్నారని మండిపడ్డారు. చివరకు జయంతికి వర్ధంతికి తేడా తెలియని లోకేష్ కూడా ప్రభుత్వంపై నిందలు వేయటం పనికిమాలిన చర్య అని నాని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం కావాలో, ప్రభుత్వం నుండి ఏం ఆశిస్తున్నారో తెలుసుకొని సుస్థిరమైన పరిపాలన చేస్తున్న ఏకైక దమ్మున్న నాయకుడు జగన్ అని కొడాలి నాని ప్రశంసలు కురిపించారు.